ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సంబంధించి నేటి ప్రశ్నలు:

1.  ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని మోదీ చేసిన వాగ్దానం జుమ్లాయేనా ?

2.  వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను తన స్నేహితులకు విక్రయించడానికి ప్రధానమంత్రి ఎందుకు ఆసక్తి చూపుతున్నారు?

3.  కీలకమైన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును మోడీ సర్కార్ ఎందుకు అడ్డుకుంటుంది?

 జుమ్లా వివరాలు:

1.  ఫిబ్రవరి 20, 2014న రాజ్యసభలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్‌కి 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు బీజేపీ నేత వెంకయ్య నాయుడు గారు స్పందిస్తూ.. ‘ఐదేళ్లు ఎందుకు, బీజేపీ ప్రభుత్వం పదేళ్లు ఇస్తుంది’ అని అన్నారు. కొన్ని వారాల తర్వాత, ఏప్రిల్ 30, 2014న పవిత్ర తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో మోదీ గారు- స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. మోడీ గారు వెంకటేశ్వర స్వామి ముందు కూడా అబద్దాలు చెప్పారు. 2014 నుండి, ఆయన ప్రభుత్వం ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన ఈ హామీని నెరవేర్చడంలో ప్రధాని మోదీ ఎందుకు విఫలమయ్యారు? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వాగ్దానం చేసినట్లుగా 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రతిజ్ఞను #CongressNyayPatra పునరుద్ఘాటించింది. ప్రధాని మోదీ కూడా అదే పనికి కట్టుబడి ఉండగలరా?

2.  మోడీ సర్కార్ కుటిల పెట్టుబడిదారీ పోకడల వల్ల ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక శ్రేయస్సు ప్రమాదంలో పడింది. సేలం, భద్రావతి మరియు బస్తర్‌లో ఉక్కు కర్మాగారాలను ప్రైవేటీకరించాలని ప్రధాని మోడీ చేసిన ఒత్తిడి తర్వాత, బిజెపి ప్రభుత్వం ఇప్పుడు "వైజాగ్ స్టీల్ ప్లాంట్" అని పిలవబడే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL)ని ప్రధానమంత్రి స్నేహితులకు విక్రయించాలని ప్రతిపాదించింది. లక్ష మందికి పైగా వ్యక్తులు తమ జీవనోపాధి కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడుతున్నారు. RINL, దాని జాయింట్ వెంచర్‌లు మరియు అనుబంధ సంస్థల 100% ప్రైవేటీకరణకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ జనవరి 2021 ఆమోదం తెలిపిన తర్వాత మూడు సంవత్సరాలుగా RINL యూనియన్‌లు శాంతియుత నిరసనల్లో నిమగ్నమై ఉన్నాయి. ఉక్కు కర్మాగారం ఉద్దేశపూర్వక ప్రభుత్వ నిర్లక్ష్యం ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న స్టీల్ ప్లాంట్‌ను భారీ నష్టాల్లోకి నెట్టివేస్తోందని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అంటున్నారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం, "విశాఖపట్నం డిక్లరేషన్"లో వివరించిన విధంగా, RINL ప్రైవేటీకరణను నిరోధించడానికి ప్రతిజ్ఞ చేసింది.

కాంగ్రెస్ నుండి లిఖితపూర్వక హామీని డిమాండ్ చేస్తున్న ప్రధానమంత్రి, తన పారిశ్రామికవేత్త స్నేహితులకు పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్లను విక్రయించనని లిఖితపూర్వకంగా హామీ ఇస్తారా?

3.  మోడీ సర్కార్ హయాంలో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే 7.20 లక్షల ఎకరాల బీడు భూములకు సాగునీరు, 28 లక్షల మందికి త్రాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి రాష్ట్రంలోని 26 జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు ఇవ్వడానికి కేంద్రం నిరాకరించింది. బీజేపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ వ్యయాన్ని 2013-14 లో వేసిన అంచనా ప్రకారమే (రూ.29,027 కోట్లు) పరిమితం చేసింది. ఇది 2017-18  లో వేసిన అంచనా (రూ.47,725 కోట్ల) కంటే చాలా తక్కువ. తగినన్ని నిధులు కేటాయించేందుకు బీజేపీ నిరాకరిస్తున్నందున 2026 నాటికి పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. ఇంతటి కీలకమైన ప్రాజెక్టును మోడీ సర్కార్ ఎందుకు నిర్లక్ష్యం చేసింది? ఇప్పటికే ఆలస్యమైన ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రధాని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?