#లైవ్ : అన్నమయ్య వర్ధంతి || తిరుమల || VBC NEWS లైవ్ స్ట్రీమింగ్ || VBC NEWS






పత్రికా ప్రకటన                      తిరుపతి, 18  మార్చి 2023

శ్రీ తాళ్లపాక అన్నమయ్య 520వ వర్ధంతి కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరణ

- మార్చి 18 నుండి 21వ తేదీ వరకు తిరుపతి, తిరుమల, తాళ్లపాకలో కార్యక్రమాలు

          పదకవితా పితామహుడు 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 520వ వర్ధంతి కార్యక్రమాల పోస్టర్లను టీటీడీ ఈవో 
శ్రీ ఎవి.ధర్మారెడ్డి బుధవారం తిరుపతిపరిపాలన భవనంలోని తమ కార్యాలయంలో ఆవిష్కరించారు. అన్న‌మాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో మార్చి 18 నుండి 21వ తేదీ వరకు తిరుమల, తిరుపతితోపాటు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలో వర్ధంతి కార్యక్రమాలు నిర్వ‌హించనున్నారు.

     ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజీ, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ అధికారి 
శ్రీ రాజగోపాలరావు, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. విభీషణశర్మ పాల్గొన్నారు.

తిరుమలలో....

        మార్చి 18వ తేదీన‌ సాయంత్రం 6 గంటలకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ప్రముఖ కళాకారులతో ''సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం'' నిర్వహిస్తారు. 

తిరుపతిలో....

మార్చి 17న అలిపిరిలో మెట్లోత్సవం

       తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద మార్చి 17వ తేదీ ఉదయం 6 గంటలకు  మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది. 

అన్నమాచార్య కళామందిరంలో...

        తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మార్చి 18న స‌ప్త‌గిరి సంకీర్త‌న‌ల‌ గోష్టిగానం నిర్వ‌హిస్తారు. మార్చి 19 నుండి 21వ తేదీ వరకు సాహితీ స‌ద‌స్సులు, సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు సంగీత కార్యక్రమాలు జ‌రుగ‌నున్నాయి. 

మ‌హ‌తి ఆడిటోరియంలో...

         మ‌హ‌తి ఆడిటోరియంలో మార్చి 18 నుండి 21వ తేదీ వరకు సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు సంగీత కార్యక్రమాలు జ‌రుగ‌నున్నాయి. ఈ కార్యక్రమాల్లో సుప్రసిద్ధ సంగీత, నృత్య కళాకారులు పాల్గొంటారు.

తాళ్ల‌పాక‌లో ...

            మార్చి 18 నుండి 21వ తేదీ వరకు తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంట‌ల వ‌ర‌కు సంగీతం, హ‌రిక‌థ విబిసి న్యూస్  లో కార్యక్రమాలు నిరంతరం ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించవచ్చు.

-------------------------------------------------------------------

విబిసి న్యూస్  విడుదల చేయబడినది